క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్‌..

1 Jan, 2022 11:09 IST|Sakshi

క్రిప్టో కరెన్సీ చట్టబద్ధత మీద దేశంలో విస్తృతమైన చర్చ ఓ వైపు జరుగుతుంటే మరో వైపు చాప కింద నీరులా క్రిప్టో వ్యవహారం దేశమంతటా విస్తరిస్తోంది. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న వజీర్‌ఎక్స్‌ ఉదంతమే ఉదాహారణగా నిలుస్తోంది. 

సిషెల్స్‌కి చెందిన బినాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఆధీనంలోని వజీర్‌ ఎక్స్‌ సంస్థ మన దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు అనధికారికంగా నిర్వహిస్తోంది. దీంతో ఇటీవల ఈ కంపెనీ రికార్డులను ప్రభుత్వ విభాగాలు పరిశీలించగా పలు అవకతవకలు వెలుగు చూశాయి. అందులో ప్రభుత్వ కళ్లు గప్పి రూ. 40 కోట్ల రూపాయల జీఎస్‌టీ ఎగ్గొట్టినట్టుగా అధికారులు గుర్తించారు.
వజీర్‌ ఎక్స్‌ సంస్థ రూపాయలను తీసుకుని క్రిప్టో లావాదేవీలకు అనువైన డబ్ల్యూఆర్‌ఎక్స్‌గా మారుస్తుంది. అదే విధంగా డబ్ల్యూఆర్‌ఎక్స్‌ని రూపాయలుగా మార్చే సేవలు అందిస్తోంది. ఇందు కోసం కమీషన్‌ వసూలు చేస్తోంది. ఇలా కమీషన్‌ సేవలకు సంబంధించి 18 శాతం పన్నును చెల్లించాల్సి ఉంది. అయితే వజీర్‌ ఎక్స్‌ ఈ పని చేయలేదు. 

వజీఆర్‌ ఎక్స్‌ జీఎస్‌టీ చెల్లించని అంశాన్ని గుర్తించిన అధికారులు వడ్డీ, జరిమానతో సహా కలిపి రూ.49.20 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వజీర్‌ ఎక్స్‌ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
 

చదవండి: క్రిప్టోకరెన్సీలపై పూర్తి నిషేధమే మేలు: ఆర్బీఐ

మరిన్ని వార్తలు