ఈ దేశంలో క్రిప్టో కరెన్సీపై నిషేధం! షరియాకి విరుద్ధమన్న మత పెద్దలు

11 Nov, 2021 20:01 IST|Sakshi

ఓ వైపు ఫ్యూచర్‌ కరెన్సీగా బిజినెస్‌ టైకూన్లు మద్దతు ఇస్తున్నా మరోవైపు అదే స్థాయిలో క్రిప్టో కరెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏషియా దేశాల్లో క్రిప్టో కరెన్సీపై ఆంక్షలు, నిషేధాలను ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మత పెద్దలు సైతం రంగంలోకి దిగారు.
క్రిప్టోపై ఎలా
ప్రపంచలోనే అత్యధికమంది ముస్లింలు నివసిస్తున్న దేశంగా ఇండోనేషియాకు గుర్తింపు ఉంది. ఇటీవల ఇండోనేషియా సెంట్రల్‌ బ్యాంకు, అక్కడి ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలో తెలపాలంటూ నేషనల్‌​ ఉలేమా కౌన్సిల్‌ని కోరింది. 
షరియాకి విరుద్ధం
క్రిప్టో కరెన్సీ తయారీ, చలామనీ తదితర విషయాలపై చర్చలు చేపట్టిన ఉలేమా బోర్డు చివరకు దాన్ని నిషేధించాలంటూ నిర్ణయం తీసుకుంది. క్రిప్టోలో ఇన్వెస్ట్‌మెంట్‌కి భద్రత లేకపోవడాన్ని కారణంగా చూపిస్తూ.. షరియా చట్టాలకు అది విరుద్ధమంటూ పేర్కొంది. పెట్టుబడికి తప్పకుండా లాభం వస్తుందని ఆధారాలు చూపిస్తే క్రిప్టో ట్రేడింగ్‌ చేసుకోవచ్చంటూ తెలిపింది.
ఏం జరగవచ్చు
నేషనల్‌ ఉలేమా కౌన్సిల్‌ నిర్ణయంతో దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పూర్తిగా నిలిచిపోకున్నా ముస్లిం మతస్తులు మాత్రం ఇన్వెస్ట్‌ చేసేందుకు వెనుకాడుతారని నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం గల్ఫ్‌ దేశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే ఆసక్తి నెలకొంది.

>
మరిన్ని వార్తలు