క్రిప్టో కరెన్సీపై ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ కీలక వ్యాఖ్యలు

20 Nov, 2021 21:15 IST|Sakshi

క్రిప్టో కరెన్సీపై విధాన పరమైన నిర్ణయం తీసుకునే విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుండగా.. రాష్ట్రీయ స్వయం సేవక్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంఛ్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది. 

అసెట్‌ క్లాస్‌
క్రిప్టో కరెన్సీని చట్ట బద్దంగా గుర్తించాలంటూ స్వదేశీ జాగరణ్‌ మంఛ్‌ కో కన్వీనర్‌ అశ్వినీ మహాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీపై ఆయన మాట్లాడుతూ ‘ ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తోన్న క్రిప్టో ఎక్సేంజీలలో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిపై ప్రభుత్వాల నిర్వాహణ ఉండటం లేదు. ఇందులో పెట్టుబడిగా వస్తున్న కరెన్సీ ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఇలా జరగడం ఎవరికీ మంచింది కాదు. కాబట్టి ప్రభుత్వాలు అస్సెట్‌ క్లాస్‌గా క్రిప్టో కరెన్సీని గుర్తించాలి. ఆ తర్వాత నియంత్రణను చట్టపరమైన విధానాలు రూపొందించాలి’ అని పేర్కొన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి.బంగారంతో

సమానం కాదు
క్రిప్టో కరెన్సీని అసెట్‌ క్లాస్‌గా గుర్తించాలని చెప్పిన మహాజన్‌ మరో కీలక వ్యాఖ్య చేశారు. అసెట్‌ క్లాస్‌తో ఉన్న బంగారంతో క్రిప్టో కరెన్సీ సమానం కాదన్నారు. బంగారం తరహాలో క్రిప్టో కరెన్సీకి ఇంట్రిన్సిక్‌ వ్యాల్యూ (అంతర్గత విలువ) లేదన్నారు. క్రిప్టో కరెన్సీలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, వాటిని ఎవరూ ఇష్యూ చేస్తున్నారు. ఎవరు కొంటున్నారు. అలా కొన్నవారు ఆ కరెన్నీతో ఏం చేస్తున్నారో తెలియక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

తలోమాట
క్రిప్టో కరెన్సీకి చట్ట బద్దత కల్పించే విషయంపై ఇటీవల జయంత్‌ సిన్హా నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఇందులో అధికార పక్షం క్రిప్టోకు మద్దతుగా అభిప్రాయం వ్యక్తం చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ క్రిప్టోను నిషేధించాలని కోరింది. మరోవైపు ఆర్బీఐ గవర్నర్‌ సైతం క్రిప్టోతో ఇబ్బందులు వస్తాయన్నట్టుగా మాట్లాడారు. కాగా తాజాగా స్వదేశీ జాగరణ్‌ మంఛ్‌ తరఫున అభిప్రాయం వ్యక్తం అయ్యింది. 
చదవండి:క్రిప్టోలతో మనీలాండరింగ్‌ భయాలు - ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఆందోళన

మరిన్ని వార్తలు