షాకింగ్‌ నిర్ణయం..! ఐపీఎల్‌-2022లో వాటి సప్పుడు ఉండదు..!

24 Mar, 2022 20:36 IST|Sakshi

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. ఈ లీగ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో అత్రుతగా వెయిట్‌ చేస్తున్నారు. వీరితో పాటుగా పలు కంపెనీలు కూడా వెయిట్‌ చేస్తున్నాయి. ఎందుకంటే సదరు కంపెనీలు ఐపీఎల్‌-2022 మ్యాచ్‌లో తమ ప్రకటనలను బ్రాడ్‌కాస్ట్‌ చేసేందుకు ఊవిళ్లురుతున్నాయి. అడ్వర్‌టైజింగ్‌ విషయంలో ఎంతైనా చెల్లించేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి. కాగా ఐపీఎల్‌-2022 నేపథ్యంలో భారత్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్సేఛేంజ్స్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాయి. 

ప్రకటనలకు దూరం..!
భారత్‌లో క్రిప్టోకరెన్సీ భారీ ఆదరణను పొందాయి. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు పలు కంపెనీలు క్రిప్టో ఎక్సేఛేంజ్‌లను నెలకొల్పాయి. ఇండియాలో వజీర్‌ ఎక్స్‌, కాయిన్‌ డీసీఎక్స్‌, కాయిన్‌ స్విచ్‌ కుబేర్‌ లాంటి క్రిప్టో ఎక్సేఛేంజ్‌లు భారీ ఆదరణను పొందాయి. ఐపీఎల్‌-2022 నేపథ్యంలో ఈ కంపెనీలకు చెందిన ప్రకటనలు కన్పించవు. ఐపీఎల్‌-15 ఎడిషన్‌ అడ్వర్టైజింగ్‌ స్పాట్స్‌ను బుక్‌ చేసుకునేందుకు సిద్దంగా లేన్నట్లు సమాచారం. ఆయా కంపెనీలు ప్రకటనలకోసం డబ్బులను వెచ్చించేందుకు రెడీగా లేవని తెలుస్తోంది. ఈ కంపెనీలు 2021లో దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. గత ఏడాది ఐపీఎల్‌ పది సెకన్ల యాడ్‌కు సుమారు రూ. 13 నుంచి 18 లక్షల వరకు ఛార్జ్‌ చేసినట్లు సమాచారం. 

కారణాలు అవేనా..?
క్రిప్టోకరెన్సీలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో సదరు కంపెనీలు వెనకడుగు వేసినట్లు సమాచారం. 2022-23 బడ్జెట్‌లో క్రిప్టో కరెన్సీలు, ఇతర డిజిటల్‌ ఆస్తుల ద్వారా వచ్చేఆదాయంపై 30 శాతం పన్నులను, రూ. 10 వేల కంటే ఎక్కువ వర్చువల్‌ కరెన్సీల చెల్లింపులపై 1 శాతం టీడీఎస్‌ విధిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిప్టో ఇన్వెస్టర్లకు, ఎక్సేఛేంజ్‌లకు కొంత మేర నష్టాలను కల్గించే అవకాశం ఉంది.  క్రిప్టోమార్కెట్‌ను నియంత్రించేందుకు కేంద్రం తీసుకునే నిర్ణయాలను బట్టి ముందుకుసాగాలని క్రిప్టో ఎక్సేఛేంజ్స్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందుగానే పలు చర్యలను తీసుకోవడం మంచిదని కంపెనీలు భావించినట్లుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

చదవండి:  బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్‌..!

మరిన్ని వార్తలు