కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు..నష్టం మామూలుగా లేదుగా!

13 Jun, 2022 19:18 IST|Sakshi

లాభాలే..లాభాలని బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ చేస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత‍్త. అనుభవంతో పనిలేకుండా, డబ్బులున్నాయని పెట్టుబడులు పెట‍్టారా? అంతే సంగతులు. మీ జేబుకు చిల్లు తప్పదిక! మొన్నటి దాకా మంచి లాభాలను తెచ్చిపెట్టిన క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను రోడ్డున పడేస్తుంది.

ఇన్నిరోజులు లాభాలతో ఇన్వెస్టర్లకు స్వర్గదామంగా మారిన బిట్‌కాయిన్‌ ఇప్పుడు నష్టాలతో కుదేలవుతుంది. ఇందులో పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు విలవిల్లాడుతున్నారు. క్రిప్టో మార్కెట్లు నేడు (జూన్‌ 13)  జనవరి 2021 తరువాత తొలిసారి 1ట్రిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు క్రిప్టో డేటా బ్లాగ్‌ 'కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌' తెలిపింది. 

2021 నవంబర్‌ నాటికి ప్రపంచ వ‍్యాప్తంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ 2.9 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. కానీ పెరిగిపోతున్న కోవిడ్‌ కేసులు, కొత్తగా పుట్టుకొచ్చిన మంకీ పాక్స్‌ లాంటి వైరస్‌లు, ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం,  సెంట్రల్ బ్యాంకుల (మన దేశంలో ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు, వివిధ దేశాల్లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు  క్రిప్టో మార్కెట్‌ భారీగా పడిపోయింది. ఎంతలా అంటే గత రెండు నెలల వ్యవధిలో ఇన్వెస్టర్లు 1 ట్రిలియన్‌ వ్యాల‍్యును కోల్పోయింది. 

18నెలల్లో లక్షల కోట్లు ఉఫ్
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌ కాయిన్‌ గడిచిన 18నెలల కాలంలో రోజులో 10 శాతానికి పైగా క్షీణించి, 18 నెలల కనిష్ట స్థాయి $23,750కి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 50 శాతం తగ్గింది. చిన్న కాయిన్ ఈథర్ 15 శాతం పైగా పడిపోయి $1,210కి చేరుకుంది.

మరిన్ని వార్తలు