Google: గూగుల్‌ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్‌..!

11 Feb, 2022 18:03 IST|Sakshi

ప్రముఖ సెర్చ్-ఇంజిన్ దిగ్గజం గూగుల్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జీ సూట్‌ (G Suite) యూజర్లకు కోసం రూపొందించిన కరెంట్స్‌ (Currents)ను మూసివేస్తున్నట్లు గూగుల్‌ నిర్ధారించింది. ఈ సేవలను  మొదటిసారిగా 2019లో గూగుల్‌  ప్రారంభించింది. 3 ఏళ్ల తరువాత గూగుల్‌ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆదరణ అంతంతే..!
గూగుల్‌ జీ సూట్‌ యూజర్లకు కోసం తీసుకొచ్చిన కరెంట్స్‌కు యూజర్ల నుంచి అత్యంత తక్కువ ఆదరణను నోచుకుంది. దీంతో గూగుల్‌ చేసేదేమీ లేక ఈ సేవలను పూర్తిగా నిలిపివేసే నిర్ణయం తీసుకుంది. ఇక కరెంట్స్‌  2023లో పూర్తిగా మూసివేయబడుతుందని గూగుల్‌  ధృవీకరించింది. దాంతోపాటుగా కరెంట్స్‌ వాడుతున్న యూజర్లను గూగుల్‌ స్పేసెస్‌కు మారేందుకు సహాయాన్ని అందిస్తామని గూగుల్‌ పేర్కొంది. కరెంట్స్‌లోని అన్ని ఫీచర్స్‌ను గూగుల్‌ స్పేసెస్‌కు జోడిస్తామని గూగుల్‌ తెలిపింది. పెద్ద కమ్యూనిటీలు, అధిక సంఖ్యలో ఎక్కువ మంది యూజర్లు వాడడానికి గూగుల్‌ స్పేసెస్‌ను తీసుకొచ్చింది. 

గూగుల్‌ స్పేసెస్‌లో మరిన్ని సౌకర్యాలు..!
యూజ‌ర్లు త‌మ ఆలోచ‌న‌ల‌ను చాటింగ్ ద్వారా పంచుకుంటూనే ముఖ్య‌మైన స‌మాచారాన్ని ఒక చోటి నుంచి మ‌రో చోటికి బ‌దిలీ చేసేందుకు స్పేసెస్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. జీ-మెయిల్ ఇన్‌బాక్స్‌ ద్వారా యూజర్లు గూగుల్ ఛాట్ చేయ‌వ‌చ్చు. గూగుల్‌ డాక్స్‌లో చెక్‌లిస్ట్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఇందులోని స్మార్ట్ కాన్వాస్‌ ఫీచర్‌ సాయపడుతుంది. స్మార్ట్ కాన్వాస్ ఫీచ‌ర్‌ సాయంతో యూజర్లు తమ ప‌త్రాలు, వర్క్‌షీట్లు, స్లైడ్స్‌ను గూగుల్‌ మీట్‌ కాల్‌లో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఇది ఇంత‌కుముందు పెయిడ్ యూజ‌ర్ల‌కే అందుబాటులో ఉండేది. దీనిని ప్రస్తుతం ప్రతి యూజరుకు ఉచితంగా అందిస్తోంది. 

చదవండి: 111 ఏళ్ల తరువాత రోల్స్‌ రాయిస్‌ సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు