ఎకానమీలపై సైబర్‌ నేరాల ప్రభావం!

14 Mar, 2022 01:49 IST|Sakshi

ఏటా రూ. 10 లక్షల కోట్ల భారం

మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి వెల్లడి

న్యూఢిల్లీ: సైబర్‌ నేరాలనేవి డిజిటలీకరణకు అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటి వల్ల 2025 నాటి కల్లా ఎకానమీలపై ఏటా 10 లక్షల కోట్ల మేర భారం పడనుందని అంచనాలు నెలకొన్నాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. సైబర్‌ నేరాల వల్ల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలపై ఏటా 6 లక్షల కోట్ల డాలర్ల మేర భారం పడుతోందని, 2025 నాటికి ఇది దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. వ్యాపారంలో టెక్నాలజీ వినియోగ తీవ్రతను బట్టే ప్రతి కంపెనీ వృద్ధి ఆధారపడి ఉంటోందని మహేశ్వరి తెలిపారు. పరిశ్రమ వృద్ధి చెందే కొద్దీ, కంపెనీలు సైబర్‌ సెక్యూరిటీపైనా, విశ్వసనీయ టెక్నాలజీపైనా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డిజిటల్‌కు మారే క్రమంలో భారత్‌ .. క్లౌడ్‌ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

మరిన్ని వార్తలు