ఈ వెబ్‌సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!

18 Aug, 2021 12:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత కొంతకాలంగా సైబర్‌ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్‌ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్‌, వెబ్‌సైట్ల పేరుతో  ప్రజలకు సైబర్‌ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్‌ స్మార్‌ఫోన్లలోకి నకిలీ వెబ్‌సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్‌లను సామాన్య ప్రజలకు సైబర్‌ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!)

తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్‌సైట్లను, ఇతర లింక్‌ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్‌, అమెజాన్‌93.కామ్‌, ఈబే19.కామ్‌, లక్కీబాల్‌, EZ ప్లాన్‌, సన్‌ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్‌సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్‌ రీచార్జ్‌ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!)

మరిన్ని వార్తలు