Cyberattacks: ఒకే సంస్ధపై సగటున వారానికి 1,738 సార్లు..!

29 Jul, 2021 21:31 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలల్లో పలు సంస్థలపై సైబర్‌దాడులు గణనీయంగా 29 శాతానికి పెరిగాయి. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో సైబర్‌దాడులు అధికంగా జరిగాయి. యూఎస్, ఆసియా పసిఫిక్ ప్రాంతాలు సైబర్‌దాడులకు గురైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ తెలిపింది. ఈ ఏడాదిలో ఆయా సంస్థలపై రాన్సమ్‌వేర్‌ దాడుల సంఖ్య 93 శాతం పెరిగిందని చెక్‌ పాయింట్‌ పేర్కొంది. చెక్‌పాయింట్‌ తన 'సైబర్ ఎటాక్ ట్రెండ్స్: 2021 మిడ్-ఇయర్ రిపోర్ట్' ను గురువారం విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో భాగంగా ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య రంగం, క్లిష్టమైన మౌలిక సదుపాయాలతో సహా అన్ని రంగాల్లోని సంస్థలపై సైబర్‌దాడులు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. 

టార్గెట్‌ భారత్‌ ..!
యూఎస్‌లో17 శాతం మేర సగటున వారానికి 443 సార్లు సైబర్‌దాడులు జరిగాయి. ముఖ్యంగా యూరప్‌లో సైబర్‌దాడులు 27 శాతం పెరుగుదల ఉండగా, లాటిన్ అమెరికాలో వృద్ధి 19 శాతం నమోదైంది. చెక్‌పాయింట్‌ తన నివేదిక భారత్‌పై జరిగిన సైబర్‌దాడులు ఒక్కింతా విస్మయానికి గురిచేసేలా ఉంది. భారత్‌కు చెందిన ఒక సంస్థపై గత ఆరునెలల్లో సగటున వారానికి 1,738 సార్లు దాడులను ఎదుర్కొన్నట్లు చెక్‌పాయింట్‌ పేర్కొంది. భారత్‌లో విద్య, పరిశోధన, ప్రభుత్వ, సైనిక, భీమా, చట్టపరమైన, తయారీ రంగాలకు చెందిన, ఆరోగ్య రంగాలకు చెందిన సంస్థలపై గణనీయంగా సైబర్‌దాడులు జరిగినట్లు చెక్‌పాయింట్‌ వెల్లడించింది. హాకర్లకు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే సైబర్‌దాడులకు భారత్‌  కీలక లక్ష్యంగా నిలుస్తోందని చెక్‌పాయింట్‌ పేర్కొంది.  

మరింత భీకరమైన దాడులు..!
ప్రపంచవ్యాప్తంగా రాన్సమ్‌వేర్‌ దాడుల్లో కూడా గణనీయమైన పురోగతి ఉందని చెక్‌పాయింట్‌ తెలిపింది. పలు సంస్థల ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలించి, ఆయా సంస్థలు హాకర్లు అడిగినంతా డబ్బు చెల్లించకపోతే బహిరంగంగా డేటాను  విడుదల చేస్తామని బెదిరింపులకు రాన్సమ్‌ వేర్‌ పాల్పడుతుంది. ఈ ఏడాదిలో రాన్సమ్‌ వేర్‌ సోలార్‌ విండ్స్‌ సప్లై చెయిన్స్‌ను లక్ష్యంగా చేసుకొని భారీగా సైబర్‌దాడులను నిర్వహించాయి. రాన్సమ్‌వేర్ దాడులను మరింత పెంచడానికి హాకర్లు కొత్త గ్రూప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెక్‌పాయింట్‌ పేర్కొంది. భవిష్యత్తులో రాన్సమ్‌వేర్‌ దాడులు మరింత భీకరంగా ఉంటాయని చెక్‌పాయింట్‌ తన నివేదికలో తెలిపింది. 

మరిన్ని వార్తలు