సైయంట్‌ చేతికి వర్క్‌ఫోర్స్‌ డెల్టా

29 Jul, 2021 01:11 IST|Sakshi

డీల్‌ విలువ రూ. 21.5 కోట్లు

న్యూఢిల్లీ: కన్సల్టింగ్‌ సంస్థ వర్క్‌ఫోర్స్‌ డెల్టాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌ వెల్లడించింది. కంపెనీ విలువను 2.7 మిలియన్‌ డాలర్లుగా (రూ. 21.5 కోట్లుగా) లెక్కగట్టి ఈ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది. తమ అనుబంధ సంస్థ సైయంట్‌ ఆస్ట్రేలియా ద్వారా వర్క్‌ఫోర్స్‌ డెల్టాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని భావిస్తున్నట్లు వివరించింది. మొబైల్‌ వర్క్‌ఫోర్స్‌ నిర్వహణకు సంబంధించి ప్రాసెస్‌ కన్సల్టింగ్‌ నుంచి సొల్యూషన్స్‌ అమలు దాకా సమగ్రమైన సేవలు అందించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని సైయంట్‌ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. 2015లో ఏర్పాటైన వర్క్‌ఫోర్స్‌ డెల్టాలో 11 మంది కన్సల్టెంట్లు ఉన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 2.9 మిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది.

మరిన్ని వార్తలు