D-Mart: ఆకాశమే హద్దుగా డీమార్ట్‌ దూకుడు...!

11 Oct, 2021 16:12 IST|Sakshi

ముంబై: రిటైల్ చైన్ సూపర్‌ మార్కెట్స్‌ డీ-మార్ట్స్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ సోమవారం రోజున సరికొత్త రికార్డును నమోదుచేసింది. డీమార్ట్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ విలువ ఏకంగా రూ. 3 ట్రిలియన్లకు (3 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17 ఇండియన్‌ స్టాక్స్‌ లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. ఈ ఏడాదిలో డీమార్ట్‌ షేర్లు  ఇప్పటివరకు సుమారు షేర్లు 70% పైగా పెరిగాయి.
చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..!

బీఎస్‌ఈ స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం రోజున  డీమార్ట్‌ షేర్‌ విలువ రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ. 4,837ను తాకింది. దీంతో డీ మార్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ రూ. 3.11 ట్రిలియన్లకు చేరుకుంది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి డీ మార్ట్‌ షేర్‌ విలువ 7 శాతం వృద్ధి చెంది  రూ. 4716.50 వద్ద నిలిచింది. 

రిలయన్స్‌ ఇతర కంపెనీల సరసన..!  
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒఎన్‌జిసి, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏషియన్ పెయింట్స్ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ మూడు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్న క్లబ్లో ఇప్పుడు డీమార్ట్‌ కూడా చేరింది. 

క్యూ-2 లో భారీ లాభాలు..!
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డీమార్ట్‌ తన స్వతంత్ర ఆదాయంలో 46శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి ₹ 7,649.64 కోట్లకు చేరుకుంది. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం..డీమార్ట్‌ వృద్ధి నివేదిక  అంచనాల కంటే 5శాతం ఎక్కువ మేర లాభాలను గడించింది. 
చదవండి: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్‌ కార్తీక్‌...!

మరిన్ని వార్తలు