డీమార్ట్‌ ఆదాయం అప్‌

5 Jan, 2023 06:22 IST|Sakshi

క్యూ3లో రూ. 11,305 కోట్లు

న్యూఢిల్లీ: డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో స్టాండెలోన్‌ ఆదాయం 25 శాతం ఎగసి దాదాపు రూ. 11,305 కోట్లకు చేరింది.

గతేడాది(2021–22) ఇదే కాలంలో నమోదైన టర్నోవర్‌ రూ. 9,065 కోట్లు మాత్రమే. 2022 డిసెంబర్‌31కల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 306ను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. రాధాకిషన్‌ దమానీ ప్రమోట్‌ చేసిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ పలు రాష్ట్రాలలో డీమార్ట్‌ బ్రాండుతో స్టోర్లను నిర్వహిస్తోంది.
ఎన్‌ఎస్‌ఈలో డీమార్ట్‌ షేరు 3.2 శాతం నష్టంతో రూ. 3,931 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు