దక్షిణాదిలో తయారీ ప్లాంటు యోచనలో డాబర్‌

21 Nov, 2023 08:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ డాబర్‌ దక్షిణాదిలో కొత్తగా ఫ్యాక్టరీ నెలకొల్పే యోచనలో ఉంది. ఏడాదిలోపే దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంస్థ సీఈవో మోహిత్‌ మల్హోత్రా తెలిపారు. 

దక్షిణాదిలో తమ వ్యాపారం గడిచిన 5–6 ఏళ్లలో రెట్టింపయ్యిందని, ప్రస్తుతం మొత్తం దేశీ విక్రయాల్లో 20 శాతం వాటా ఉంటోందని ఆయన చెప్పారు. దక్షిణాది మార్కెట్లో విప్రో తదితర ఎఫ్‌ఎంసీజ తయారీ సంస్థలు ఫుడ్‌ సెగ్మెంట్‌లోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తాము కూడా ఇక్కడి మార్కెట్‌ కోసం కస్టమైజ్డ్‌ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మల్హోత్రా చెప్పారు. 

కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వార్షికంగా దాదాపు రూ. 350–450 కోట్ల మేర పెట్టుబడి ప్రణాళికలున్న డాబర్‌ ఇండియా.. అటు అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, యూరప్‌ మార్కెట్లలోను తమ తయారీ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. డాబర్‌కు సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియే తదితర దేశాల్లోనూ ప్లాంట్లు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు