రెండో రోజు నష్టాలతోనే ప్రారంభం

20 Jul, 2021 10:08 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాలను తోడు థర్డ్‌వేవ్‌ భయాలు వెంటాడుతుండటంతో అమ్మకాలకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు సూచీలు నష్టాలతోనే మొదలయ్యాయి.

ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయంలో 301 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 52,252 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిన్న సెన్సెక్స్‌ 52,553 పాయింట్ల వద్ద క్లోజవగా ఈ రోజు 52,432 పాయింట్లతో మొదలైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 15,652 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఆసియన్‌ పేయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాలు పొందగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.  

>
మరిన్ని వార్తలు