పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌.. లాభాలతో ముగింపు

21 Sep, 2021 15:55 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. ఈ సెషన్‌ తొలి రోజు భారీ నష్టాలను చవి చూసిన ఇన్వెస్టర్లు మంగళవారం తేరుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నా దేశీ సూచీలు లాభాల వైపు స్థిరంగా కదిలాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58,630 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు పొందింది. అయితే ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ మరోసారి నష్టాలు తప్పవనే పరిస్థితి ఎదురైంది. కనిష్టంగా 58,232 పాయింట్లను టచ్‌ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు నమ్మకం చూపించడంతో క్రమంగా లాభపడుతూ ఓ దశలో 59,084 పాయింట్లను తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 514 పాయింట్లు లాభపడి  59,005 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 17,564 పాయింట్ల దగ్గర ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఐటీసీ షేర్లు  లాభాలను పొందగా మారుతి సుజూకి, బజాజ్‌ ఆటో, నెస్టల్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌ షేర్లు నష్టాలను చవి చూశాయి.
 

చదవండి : ప్రతికూల పరిస్థితుల్లోనూ..లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

మరిన్ని వార్తలు