నెగటివ్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్‌

19 Jul, 2021 09:46 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీలు నెగటివ్‌గా  స్పందించడంతో ఆ ప్రభావం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలపై కూడా కనిపించింది. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రికార్డు స్థాయిలో 53,140 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు ఉదయం 52,606 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ కనిష్టంగా 52,506 పాయింట్లకు పడిపోయింది. గరిష్టంగా 52,703 పాయింట్లను తాకింది. ఉదయం 9:30 గంటల సమయానికి 495 పాయింట్లు కోల్పోయి 52,644 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

గత వారం 15,800 పాయింట్లు దాటిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈరోజు 15,754 పాయింట్లతో ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయానికి 168 పాయింట్లు కోల్పోయి 15,754 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గత శుక్రవారం ఐపీవోకి వచ్చిన తత్వ చింతన్‌ ఫార్మాకి మంచి స్పందన వస్తోంది. జీఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, క్లీన్‌ సైన్స్‌ ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌లో అడుగు పెడుతున్నాయి. ఈ రెండు ఐపీవోలకు మంచి స్పందన రావొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి, 

మరిన్ని వార్తలు