భారీగా నష్టపోయిన సూచీలు.. ఇన్వెస్టర్లకు తప్పని నష్టాలు

12 Apr, 2022 16:09 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. మార్చి నెలకు సంబంధించి వెలువడిన చిల్లర ద్రవ్యోల్బణం ఫలితాలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేశాయి. దీంతో అమ్మకాలకు  మొగ్గు చూపారు. ముఖ్యంగా మెటల్‌, ఐటీ రంగాల్లో షేర్లు భారీగా నష్టపోయాయి. ఫలితంగా ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు తప్పలేదు.

ఈరోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నష్టాలతోనే ఆరంభమైంది. క్రితం రోజు 58,964 పాయింట్ల దగ్గర మార్కెట్‌ క్లోజవగా ఈరోజు ఉదయం 58,743 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 388 పాయింట్లు నష్టపోయి 58,576 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 145 పాయింట్లు నష్టపోయి 17,530 పాయింట్ల దగ్గర ముగిసింది. ఓవరాల్‌గా సెన్సెక్స్‌ 0.66 శాతం, నిఫ్టీ 0. 2 శాతం క్షీణించాయి. నిఫ్టీలో పదిహేను సెక్టార్లలో 12 సెక్టార్లు నష్టాల్లో ముగిశాయి. 
 

మరిన్ని వార్తలు