వరుస నష్టాలకు చెక్‌.. మూడో రోజు లాభాలతో ముగింపు

20 Apr, 2022 15:43 IST|Sakshi

ముంబై: వరుసగా రెండు రోజుల పాటు వచ్చిన నష్టాలకు బుధవారం అడ్డుకట్ట పడింది. ఆటోమొబైల్‌, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు లాభాల్లోనే ట్రేడ్‌ అయ్యాయి. చైనాలో కోవిడ్‌ పరిస్థితులు, ఉక్రెయిన్‌ ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నా వాటి ప్రభావం ఈ రోజు మార్కెట్‌పై కనిపించలేదు. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56,741 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో గరిష్టంగా 57,216 పాయింట్లను టచ్‌ చేసింది. చివరకు 57,053 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ రోజు సెన్సెక్స్‌ 30 సూచీ 590 పాయింట్లు లాభపడింది. మరోవైపు నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 17,146 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగియగా స్మాక్‌ క్యాప్‌ షేర్లు ఇంకా నష్టాల బారి నుంచి బయట పడలేదు. ఈ రోజు మార్కెట్‌లో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి సుజూకి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, షేర్లు లాభపడగా ఐసీఐసీఐ,. బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.


 

మరిన్ని వార్తలు