బుల్‌ జోరు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

21 Apr, 2022 16:00 IST|Sakshi

ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో దూసుకుపోతుంది. గత రెండు రోజులకు భిన్నంగా ఈరోజు బ్లూచిప్‌ కంపెనీలకు తోడు స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు కూడా లాభాలు అందించాయి. హెవీ వెయిట్‌ రిలయన్స్‌ షేర్లు ఈ రోజు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మూడు వందల పాయింట్లు పైగా లాభమంతో మొదలైంది ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో గంటగంటకు లాభపడుతూ పోయింది. ఉదయం 57,458 పాయింట్లతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 57,991 పాయింట్లను టచ్‌ చేసింది. చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో  57,911 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 256 పాయిం‍ట్ల లాభంతో 17,392 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈరోజు మార్కెట్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా, మారుతి సుజూకి ఇండియా, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, రిలయన్స్‌ షేర్లు లాభాలు పొందాయి. టాటాస్టీల్‌, భారతి ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు