ఫ్యూచర్‌తో రిలయన్స్‌ డీల్‌ క్యాన్సిల్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

25 Apr, 2022 16:57 IST|Sakshi

ముంబై: ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో ఆరంభమైంది. యూస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ సూచీలు బలహీనంగా కదలాడాయి. వాటి ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఈ రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో ఐటీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి.

ఏడాదికి పైగా కొనసాగుతున్న రియలన్స్‌, ఫ్యూచర్‌, అమెజాన్‌ వివాదం ముగింపుకు వచ్చింది. అమెజాన్‌ అభ్యంతరాల నేపథ్యంలో ఫ్యూచర్‌ గ్రూపును కొనుగోలు చేయాలనే నిర్ణయం నుంచి రిలయన్స్‌ వెనకడుగు వేసింది. దీంతో రూ.24, 713 కోట్ల రూపాయల భారీ డీల్‌ క్యాన్సిల్‌ అయ్యింది. ఈ నిర్ణయం వెడివన వెంటనే ఫ్యూచర్‌ షేర్లు దారుణంగా నష్టపోయాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 20 శాతానికి పైగా ఫ్యూచర్‌ షేరు పతనమైంది. ఇటీవల కాలంలో దారుణంగా పతనమైన పేటీఎంను వెనక్కి నెట్టింది ఫ్యూచర్‌. మరోవైపు రిలయన్స్‌ షేరు ధర కూడా 2.4 శాతం మేర నష్టపోయింది.

ఈరోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంచుమించు 400 పాయిం‍ట్ల నష్టంతో 56,757 పాయింట్ల వద్ద మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. స్మాల్‌, మిడ్‌, బ్లూచిప్‌ ఇలా అన్ని కేటగిరీల్లో నష్టాలు వచ్చాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 617 పాయింట్లు నష్టపోయి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 218 పాయింట్లు నష్టపోయి 16,953 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.  

చదవండి: నెగ్గిన అమెజాన్‌ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్‌ను రద్దు చేసుకున్న రిలయన్స్‌..!

మరిన్ని వార్తలు