స్వరం పెంచిన రష్యా.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్‌

27 Apr, 2022 15:40 IST|Sakshi

ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు నష్టాలను చవి చూశారు. మార్కెట్‌ పెద్దన్న రిలయన్స్‌ షేర్ల ధర ఆల్‌టైం హైకి చేరుకున్నా.. మిగిలిన అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా మరింత దూకుడు పెంచింది. పోలాండ్‌, బల్గేరియా దేశాలకు ఆయిల్‌ సరఫరా నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుదుపుకు గురయ్యాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎలా అదుపు చేయాలో తెలియక సతమతం అవుతుంటే యుద్ధం మరింతగా ముదురుతుండటం ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 సూచీ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50లో  అయితే కేవలం 3 కంపెనీలు మినహా మిగతా అన్ని నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఈ రోజు ఉయదం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 56,983 పాయింట్ల దగ్గర నష్టాలతో మొదలైంది. అబుదాబీ కంపెనీతో కుదిరిన డీల్‌ కారణంగా రిలయన్స్‌ షేర్లు ఆల్‌టైం హైంని తాకాయి. మరోవైపు అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో నష్టాలు మొదలయ్యాయి. ఒక దశలో 56,583 పాయింట్ల కనిష్టాలకు చేరుకుంది. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 556 పాయింట్ల నష్టంతో 56,800ల పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 17,032 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు