స్టాక్‌ మార్కెట్‌లో ఊగిసలాట.. లాభనష్టాల మధ్య సూచీలు

5 Apr, 2022 09:50 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం మార్కెట్‌ ఆరంభమైన తర్వాత జపాన్‌ నిక్కీ, సౌత్‌కొరియా కొప్సీ సూచీలు నష్టపోయాయి. ఇదే సమయంలో షాంగై స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. బుల్‌ర్యాలీ మరికొంత కాలం కొనసాగుతుందా? లేక కరెక‌్షన్‌ను ఛాన్స్‌ ఉందా అనే కోణంలో బేరిజు వేసుకుని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో మార్కెట్‌లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది.

ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 28 పాయింట్లు నష్టపోయి 60,582 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మొదటి అరగంటలో వచ్చిన లాభాలు హుష్‌కాకి అయ్యాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 11 పాయింట్లు నష్టపోయి 18,042 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభాల్లో ఉండగా నిన్న గణనీయంగా లాభపడిన హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఈ రోజు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీతో పాటు బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌మహీంద్రా బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు