మార్కెట్‌లో మళ్లీ బుల్‌ జోరు

8 Dec, 2021 16:06 IST|Sakshi

ముంబై: వడ్డీరేట్ల పెంపు విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయం మార్కెట్‌లో జోష్‌ నింపింది. ఉదయం నుంచే మార్కెట్‌లో బుల్‌ జోరు కనిపించగా ఆర్బీఐ ద్రవ్య వినిమయ కమిటీ నిర్ణయాలు వెల్లడైన తర్వాత మరింతగా దేశీ సూచీలు పుంజుకున్నాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1016 పాయింట్లు లాభం పొందగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 293 పాయింట్లు లాభపడింది. దీంతో వరుసగా రెండో రోజు స్టాక్‌ మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. 

ఈరోజు ఉదయం సెన్సెక్స్‌ 58,158 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పొందుతూ ఓ దశలో 58,702 పాయింట్లను టచ్‌ చేసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 1016 పాయింట్ల లాభంతో 58,649 పాయింట్ల దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ 17,469 దగ్గర క్లోజయ్యింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభాలు పొందాయి.

మరిన్ని వార్తలు