Stock Market: సర్రున కిందికి జారిన సూచీలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

7 Jun, 2022 10:17 IST|Sakshi

ముంబై: ఆర్బీఐ వడ్డీరేటు వార్తలు, ఉక్రెయిన్‌లో భూభాగాలను రష్యా ఆక్రమించుకోవచ్చనే వార్తల నేపథ్యం, పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు వెరసి ఇన్వెస్టర్లలో ఆందోళనల రేకెత్తించాయి. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో స్మాల్‌, మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, కన్సుమర్స్‌ గూడ్స్‌ విభాగంలో షేర్లు భారీగా నష్టపోయాయి.

ఈరోజు ఉదయం 55,373 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆరంభంలోనే మూడు వందల పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10:15 గంటల సమయంలో 634 పాయింట్లు నష్టపోయి 55,041 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 16,404 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ , యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉండగా టైటాన్‌ కంపెనీ, ఏషియన్‌ పేయింట్స్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, సన్‌ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.

>
మరిన్ని వార్తలు