‘రెపో’ ఎఫెక్ట్‌.. నష్టాలతోనే ఆరంభం

9 Jun, 2022 09:24 IST|Sakshi

ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ రెపోరేటు పెంపు, ఆర్థిక వృద్ధి కుదింపు, అంతర్జాతీయంగా భయపెడుతున్న చమురు ధరల ఎఫెక్ట్‌తో దేశీ సూచీలు నష్టాలతో ఆరంభం అయ్యాయి. పైగా రాబోయే నెలల్లో వడ్డీరేట్లు మరింతగా పెరుగుతాయనే అంచనాలు ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఫలితంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  క్రితం రోజు లాభ నష్టాల మధ్య ఊగిసలాడి చివరకు నష్టాలతో మార్కెట్‌ ముగిసింది. ఈ రోజు ఉదయం కూడా అదే ట్రెండ్‌ కొనసాగిస్తూ నష్టాలతోనే ఆరంభం అయ్యింది. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మూడు వందల పాయింట్లకు పైగా నష్టంతో ఆరంభమైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 378 పాయింట్లు నష్టపోయి 54,514 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి 16,209 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు