అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

6 May, 2022 15:45 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లపై పడింది. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు పెంచనుందనే వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్‌లు నిన్న నష్టాలతో ముగిశాయి. దాని ప్రభావం ఈ రోజు ఏషియా మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు ముడి చమురు ఉత్పత్తి పెంపుపై ఒపెక్‌ దేశాల మొండిపట్టుదల కూడా తోడైంది. ఫలితంగా ముడి చమురు బ్యారెల్‌ ధర 110 డాలర్లకు ఎగిసింది. మరోవైపు ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్నాయి. దీంతో ఈ రోజు ఉదయం ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, అటు నిఫ్టీలు నష్టాలతో మొదలయ్యాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సుమారు 800 పాయింట్ల నష్టంతో 54,928 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్‌ను ఉత్తేజ పరిచే ఘటనలు చోటు చేసుకోలేదు. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 760 పాయింట్లు నష్టపోయి 54,941 దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయి 16,428 పాయింట్ల దగ్గర ముగిసింది. బ్లూచిప్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ అన్ని కేటగిరిల్లో నష్టాలు నమోదు అయ్యాయి.

చదవండి: బ్యాంకుల వడ్డింపు షురూ..

మరిన్ని వార్తలు