బేర్‌ పంజా.. ఆరంభంలోనే భారీ నష్టాలు

9 May, 2022 09:54 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌కు ప్రతికూలంగా మారుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటి ప్రభావం దేశీ ఇన్వెస్టర్లపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. షాంగైలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండం, ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో అమెరికాపై రష్యా తీవ్ర విమర్శలు చేయడం, వివిధ దేశాల రిజర్వ్‌ బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లు పెంచడం తదితర కారణాలు ఇందుకు కారణం. దీంతో ఈ రోజు ఉదయం మార్కెట్‌ ఆరంభం కావడంతోనే భారీ నష్టాలను చవి చూసింది. గత వారమే దాదాపు 4 శాతం వరకు మార్కెట్లు క్షీణించాయి.

ఈ రోజు ఉయదం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54,188 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ మొదలెట్టింది. ఆరంభంలోనే ఆరు వందలకు పైగా పాయింట్లను నష్టపోయింది. ఉదయం 9:51 గంటల సమయంలో 658 పాయింట్లు నష్టపోయి 54,177 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 250 పాయింట్లు నష్టపోయి 16,161 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నష్టాలు ఇదే తీరున కొనసాగితే సెక్సెక్స్‌ 54 వేల మార్క్‌ని, నిఫ్టీ 16 వేల మార్క్‌ దిగువకు పడిపోయే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు