మార్కెట్‌లో అస్థిరత.. మళ్లీ నష్టాల్లో సూచీలు

11 May, 2022 10:22 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చిత్తి నెలకొంది. దేశీ సూచీలు ఉదయం లాభాలతో ఆరంభమైనా ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్‌ను ఉత్తేజ పరిచే పరిణామాలేవీ అంతర్జాతీయ, దేశీయంగా చోటు చేసుకోకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54,544 పాయింట్లలో లాభాలతో ఆరంభమైంది. ఆ తర్వాత 54,598 పాయింట్లను టచ్‌ చేసింది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్‌ పడుతుందనే నమ్మకం కుదిరింది. కానీ ఆ వెంటనే అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:20 గంటల సమయంలో 293 పాయింట్లు నష్టపోయి 54,071 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నష్టాలు ఇలాగే కొనసాగితే సెన్సెక్స్‌ 53 వేల దిగువకు పడిపోయేందుకు ఆస్కారం ఉంది. ఇదే తరహాలో నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,178 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు