దేశీ ఇన్వెస్టర్ల మద్దతు.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

13 May, 2022 10:17 IST|Sakshi

ముంబై: వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ఉంది. ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి దేశీ సూచీలు పడిపోవడంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే ద్రవ్యోల్బణం కట్టడిలో లేకపోవడం, ఫిన్‌లాండ్‌ తాజా నిర్ణయంలో ముదిరిన అంతర్జాతీయ ఉద్రిక్తలు , పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇంకా ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేస్తూనే ఉన్నాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 53,565 పాయింట్ల దగ్గర లాభాలతో ఆరంభమైంది. ఆ తర్వాత కాసేపటికి 53,625 పాయింట్ల గరిష్టాలను టచ్‌ చేసింది. కానీ ఆ తర్వాత అక్కడే ఎక్కువ సేపు ఉండేలేక కిందకు జారుకుంది. ఉదయం 10:15 గంటల సమయంలో 340 పాయింట్ల లాభంతో 53,270 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 15,950 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, టైటాన్‌ షేర్లు లాబపడిగా.. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టాలను చవి చూశాయి.
 

మరిన్ని వార్తలు