లాభాలు మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు

19 May, 2022 09:45 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్లపై నేరుగా పడింది. దీంతో ఈ రోజు మార్కెట్‌ నష్టాలతోనే  ఆరంభమైంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్‌ పడింది.యుక్రెయిన్‌ వార్‌ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోవడం, చైనా జీరో కోవిడ్‌ పాలసీలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి.

ఈరోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంచుమించు వెయ్యి పాయింట్ల నష్టంతో 53,070 దగ్గర ట్రేడింగ్‌ మొదలైంది. మార్కెట్‌లో అస్థిరత నెలకొనడంతో సూచీలు అక్కడి నుంచి అటుఇటుగా కదలాడుతోంది. ఉదయం 9:40 గంటల సమయంలో 994 నష్టపోయి 1.83 శాతం క్షీణించి 53,214 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ భారీగా కుదేలవుతోంది. 421 పాయింట్ల నష్టంతో 2.58 శాతం క్షీణించి 15,935 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఇండియా వీఐఎక్స్‌ షేర్లు భారీగా నష్టపోయాయి.  

మరిన్ని వార్తలు