దేశీ సూచీల నేల చూపులు.. ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం..

19 May, 2022 15:48 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్‌తో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేల చూపులు చేశాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన లక్షల కోట్ల  రూపాయల సంపద ఆవిరైంది. మార్కెట్‌ ఆరంభం నుంచి ముగింపు వరకు షేర్లు తమ విలువలను కోల్పోతూనే ఉన్నాయి. సెన్సెక్స్‌ 30, నిఫ్టీ 50లోని ప్రముఖ కంపెనీల షేర్లు ఢమాల్‌ అన్నాయి.

ఈరోజు ఉదయం ఇంచుమించు వెయ్యి పాయింట్ల నష్టంతో 53,070 పాయింట్ల దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లను కోల్పోతూనే వచ్చింది, ఒక దశలో 52,669 పాయింట్ల కనిష్టాలను టచ్‌ చేసింది. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 1416 పాయింట్ల నష్టంతో 2.61 క్షీణత నమోదు చేసి 52,792 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే సెన్సెక్స్‌ను మించి నష్టాలను చవి చూసింది. 520 పాయింట్లు నష్టపోయి 3.18 శాతం క్షీణించి 15,836 పాయింట్ల దగ​‍్గర ముగిసింది.

మార్కెట్‌ విశేషాలు
- బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో 278 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌లో ఉన్నాయి.
- బీఎస్‌ఈలో బీ కేటగిరీలో 47 స్టాక్స్‌ లోయర్‌ సర్క్యూట్‌లో ఉన్నాయి.
- 82 స్టాక్స్‌ ఇయర్‌లోను చూశాయి
- నిఫ్టీ 50 మిడ్‌క్యాప్‌లో 3.50 లక్షల కోట్ల సందప ఆవిరైంది
- టాప్‌ 5 ఐటీ కంపెనీల మార్కెట్‌క్యాప్‌కి రూ.1.40 లక్షల కోట్ల మేర కోత పడింది
- ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు బాగా లాభపడ్డాయి, ఇవాల ఒక్కరోజే ఐటీసీ మార్కెట్‌ క్యాప్‌ 11 వేల కోట్లు పెరిగింది.
- ఇష్యూ ప్రైస్‌తో పోల్చితే ఎల్‌ఐసీ షేర్‌ వ్యాల్యూకి మరింత కోత పడింది. మొత్తంగా పది శాతం మేర క్షీణించింది
 

మరిన్ని వార్తలు