స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టు.. మళ్లీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు

25 Nov, 2021 09:59 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టు సడలడం లేదు. దేశ ఆర్థిక ప్రగతిపై వివిధ సంస్థలు వెలువరిస్తున్న నివేదికలు సానుకూల ఫలితాలు ప్రకటిస్తూన్నా.. మార్కెట్‌ను నష్టాలు వీడటం లేదు. సుదీర్ఘ కాలం కొనసాగిన బుల్‌ ర్యాలీ నుంచి లాభాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో మార్కెట్‌లో బేర్‌ హవా తగ్గడం లేదు. 

బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 58,363 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత లాభపడుతూ 58,439 పాయింట్లకు చేరుకుంది. అయితే అక్కడ ఎక్కువ సేపు నిలబడలేకపోయింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల పాలైంది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్‌ 27 పాయింట్లు నష్టపోయి 58,314 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 17,409 దగ్గర కొనసాగుతోంది. 
 

మరిన్ని వార్తలు