స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత.. లాభ నష్టాల మధ్య ఊగిసలాట

28 Sep, 2021 09:59 IST|Sakshi

ముంబై : స్టాక్‌మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఈ రోజు ఉదయం సైతం భారీ లాభాలతో స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభమైంది. అయితే కాసేపటికే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో క్రమంగా పాయింట్లు కోల్పోయింది. ఓ దశలో సెన్సెక్స్‌ 60 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. మళ్లీ వెంటనే కొనుగోల్లు ప్రారంభం కావడంతో 60 వేల పాయింట్లను కాపడుకోగలిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఓ బుల్‌ బుల్‌ జోరులో ఇన్వెస్ట్‌ చేస్తూనే మరోవైపు మార్కెట్‌లో కరెక‌్షన్‌ ఏ క్షణమైన రావొచ్చనే భయం నెలకొనడంతో ముదుపరులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 

ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 60,285 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు నష్టపోయింది, తిరిగి పుంజుకుంది. ఉదయం 10 గంటల సమయానికి 14 పాయిం‍ట్లు నష్టపోయి 60,063 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 17,844 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

రిలయన్స్‌, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌కార్పోరేషన్‌ షేర్లు లాభపడగా హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పేయింట్స్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టపోయాయి.
చదవండి : ఎస్‌బీఐ హోమ్ లోన్ ద‌ర‌ఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు ఇవే..!

మరిన్ని వార్తలు