అదే జోరు.... లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌

6 Oct, 2021 10:04 IST|Sakshi

ముంబై : దేశీ స్టాక్‌మార్కెట్‌లో బుల్‌జోరు కొనసాగుతూనే ఉంది. ఏ క్షణాన్నైనా మార్కెట్‌లో అనూహ్య నష్టాలు తప్పవంటూ వెలువడుతున్న అంచనాలే తప్పులుగా తేలుతున్నాయి. ఏషియన్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నా దేశీ మార్కెట్లు వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా బుధవారం సైతం స్టాక్‌మార్కెట్‌ సూచీలు లాభాల బాటలోనే పయణిస్తున్నాయి.

ఉదయం 10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 71 పాయింట్లు లాభపడి 59,816 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 17,851 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్టీపీసీ, టైటాన్‌ షేర్లు లాభాలు పొందగా ఇండస్‌ ఇండ్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టపోయాయి.

చదవండి : Moody: మారిన ‘అవుట్‌లుక్‌’, భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే?

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు