లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌

11 Oct, 2021 10:04 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్లో అస్థిరత నెలకొంది, ఈ వారం సెషన్‌ లాభాలతోనే మొదలైనా.. కాసేపటికే ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం ప్రారంభించింది. ఐటీ షేర్ల బాగా నష్టపోయాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ షేర్ల ధరలు పడిపోయాయి. దీంతో సూచీలు వేగంగా పతనం  అవడం ప్రారంభించాయి. ఆ తర్వాత మరోసారి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిండంతో వేగంగా మార్కెట్‌ లాభాల బాట పట్టింది.

ఉదయం పది గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 148 పాయింట్లు లాభపడి 60,207 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 17,946 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ సెషన్‌లో నిఫ్టీ గరిష్ట స్థాయిలకు చేరుకుని 18 వేల పాయింట్లను తాకుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో టీసీఎస్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి. ఇక లాభం పొందిన వాటిలో మారుతి సుజూకి, పవర్‌గ్రిడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కోటక్ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు