Stock Market : అదే జోరు .. తగ్గేది లేదు

13 Oct, 2021 10:04 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో జోరు కొనసాగుతోంది. బుల్‌ పరుగులు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు తాజాగా మరోసారి సరికొత్త గరిష్టాలను టచ్‌ చేశాయి. ఉదయం పది గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 263 పాయింట్లు లాభపడి 60,547 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ వంద పాయింట్లు లాభపడి 18,091 వద్ద కొనసాగుతోంది.

మహీంద్రా అండ్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పేయింట్స్‌, ఎన్టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాలు పొందాయి. టాటాస్టీల్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌లిమిటెడ్‌ షేర్లు నష్టాలు పొందాయి.
 

మరిన్ని వార్తలు