అదే దూకుడు.. లాభాల్లో సూచీలు

19 Oct, 2021 09:51 IST|Sakshi

ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో సూచీలు సానుకూలంగా ఉండటం, ఇటు ఏషియా మార్కెట్లు సైతం లాభాల బాటలో పయణిస్తుండటం దేశీ మార్కెట్ల జోరుకు మరింత ఊతం ఇచ్చాయి. గత కొంత కాలంగా కొనసాగుతోన్న బుల్‌ జోరుని మరింతగా పెంచాయి. దీంతో ఈ రోజు మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు ఆల్‌టైం హైలను టచ్‌ చేశాయి. 

ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్‌సీ సెన్సెక్స్‌ 358 పాయింట్లు లాభపడి 62,123 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 18,571 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు నిఫ్టీ ప్రారంభం కావడమే  18,602 పాయింట్లతో మొదలై ఆల్‌టైం హైని టచ్‌ చేసింది. ఎల్‌ అండ్‌ టీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, ఆల్ట్రాటెక్‌, టైటాన్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు