నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

28 Oct, 2021 09:30 IST|Sakshi

ముంబై: స్టాక్‌మార్కెట్‌లో కరెక‌్షన్‌ కొనసాగుతూనే ఉంది. నిన్న నష్టాలతో మార్కెట్‌ ముగియగా.. ఈ రోజు కూడా అదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీలు లాభాలతో ఆరభించినా పట్టుమని పదినిమిషాలు కూడా అది నిలిచి ఉండలేదు. ఆ వెంటనే నష్టాల దిశగా సూచీలు పరుగెడుతున్నాయి. మరోసారి సెన్సెక్స్‌ 61 వేల దిగువకు పడిపోయింది.

ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 181 పాయింట్లు నష్టపోయి 60,961 పాయిం‍ట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 18,187 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు