లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌

8 Dec, 2021 09:39 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. ఆర్బీఐ ద్రవ విధాన కమిటీ సమావేశంలో మార్కెట్‌ సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపారు. దీంతో దేశీ సూచీలు మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే లాభాల పట్టాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు ఉదయం 58,158 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వరుసగా పాయింట్లు పెరగడం మొదలైంది. ఉదయం 9:35 713 పాయింట్లు లాభపడి 58,346 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 177 పాయింట్లు లాభపడి 17,315 దగ్గర కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు