లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

7 Dec, 2021 10:10 IST|Sakshi

ముంబై: ఏషియన్‌ మార్కెట్లు కోలుకోవడంతో దేశీ మార్కెట​‍్లు సైతం లాభాల బాట పట్టాయి,. ఇటు సెన్సెక్స్‌ అటు నిఫ్టీలో బ్లూ చిప్‌ కంపెనీల షేర్ల ధరలు పెరగడంతో మార్కెట్‌లో ఆశజనక వాతావరణం నెలకొంది. మరోవైపు ఆర్బీఐ ద్రవ విధాన కమిటీ సమావేశం సైతం మార్కెట్‌ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే వార్తల నేపథ్యంలో దేశీ సూచీలు లాభాలు పొందుతున్నాయి.

మంగళవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 57,125 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు పొందుతూ పోయింది. ఉదయం 10 గంటల సమయంలో 541 పాయింట్లు లాభపడి 57,288 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 17,068 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు