స్టాక్‌మార్కెట్‌లో బుల్‌ జోరు.. లాభాల్లో సూచీలు

28 Jan, 2022 10:17 IST|Sakshi

ముంబై : గత పది రోజులుగా నష్టాల్లో కూరుకుపోయి స్టాక్‌ మార్కెట్లు తేరుకున్నాయి. ఈ వారం చివరి సెషన్‌లో జోరు చూపిస్తున్నాయి. మార్కెట్‌ ప్రారంభమైన గంట తర్వాత బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 740 పాయింట్లు లాభపడగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 209 పాయింట్లు లాభపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెంపు కారణంగా గత వారం రోజులుగా నష్టాల పాలవుతున్న ఏషియన్‌ మార్కెట్లు అన్నీ కోలుకుంటున్నాయి.

ఉదయం 10:10 గంటల సమయంలో 755 పాయింట్ల లాభంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58 వేల మార్క్‌ను క్రాస్‌ చేసింది. నిఫ్టీ 238 పాయింట్లు లాభపడి 17,348 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించడంతో రెండు సూచీలు క్షణక్షణానికి పైపైకి ఎగబాకుతున్నాయి. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాలు పొందాయి. హెచ్‌డీఎఫ్‌సీ, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీలో రియల్టీ, బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీలు లాభాల బాటలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు