వెయ్యి పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌.. 57 వేల దిగువన ట్రేడింగ్‌

26 Nov, 2021 10:13 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో ప్రతికూల ప్రభావాలకు తోడు ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతుండటంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అంతేకాకుండా కరోనా న్యూ వేరియంట్‌ వ్యాప్తి వార్తలు మార్కెట్‌పరై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో స్టాక్‌మార్కెట్‌లో బిగ్‌ ప్లేయర్‌గా ఉన్న రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, ఇన్‌ఫోసిస్‌ వంటి షేర్ల ధరలు కుంగిపోయాయి. ఫలితంగా మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి దేశీ సూచీలు రికార్డు స్థాయిలో పాయింట్లు కోల్పోతున్నాయి.  గంటకే సెన్సెక్స్‌ ఏకంగా 1400లకు పైగా పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 400లకు పైగా పాయింట్లు నష్టపోయింది. దీంతో సెన్సెక్స్‌ 57 వేలు, నిఫ్టీ 17 వేల దగ్గర  ట్రేడ్‌ అవుతున్నాయి.

ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 58,254 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల పాలైంది. ఉదయం 10 గంటల 47 నిమిషాలకు 1342 నష్టపోయి 2.28 శాతం క్షీణించి 57,452 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ సైతం భారీగా నష్టపోయింది.  411 పాయింట్లు నష్టంతో  2.35 శాతం క్షీణించి 17,124 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు