నష్టాలతో మొదలైన మార్కెట్‌

16 Nov, 2021 09:44 IST|Sakshi

ముంబై: దేశీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలకు వరుసగా 60, 18 వేల పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్‌ ఎదురవుతోంది. దాదాపు నెల క్రితమే 61 వేల పాయింట్లను క్రాస్‌ చేసిన బీఎస్‌ఈ.. ఒక్కసారిగా 59 వేల పాయింట్లకు పడిపోయింది. అక్కడి నుంచి పైకి ఎగబాకే క్రమంలో 60 వేల పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్‌ ఎక్కువగా ఉంది. మంగళవారం హిందాల్కో, టాటాస్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నష్టపోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నష్టాల్లో ఉంది.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60,755 పాయింట్లతో మొదలైంది. ఉదయం 9:40 గంటల సమయానికి 98 పాయింట్లు నష్టపోయి 60,620 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18,127 పాయింట్లతో ప్రారంభం కాగా 32 పాయింట్లు నష్టపోయి 18,076 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. దేశీ స్టాక్‌మార్కెట్‌ నష్టాల్లో ఉండగా మరోవైపు ఇతర ఏషియన్‌ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు