స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న నష్టాలు

17 Nov, 2021 09:58 IST|Sakshi

ముంబై: ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. మార్కెట్‌లో బిగ్‌ ప్లేయర్లుగా ఉన్న రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిక్‌, కోటక్‌ మహీంద్రా తదితర షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. దీంతో ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు నష్టాలతో ఈ రోజు ప్రారంభించాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నష్టాలతోనే 60,179 పాయింట్ల దగ్గర మొదలయ్యింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ ఓ దశలో 60,029కి చేరుకుంది. మరోసారి 60 వేల మార్క్‌ని సెక్సెక్స్‌ కోల్పోతుందనేలా పాయింట్లు నష్టపోయింది. అయితే ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 10 గంటల సమయానికి 80 పాయింట్లు నష్టపోయి 60,242 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 17,961 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఏషియన్‌ పేయింట్స్‌, ఎన్టీపీసీ, మారుతి సుజూకి, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు