లాభాల్లో కదులుతున్న సూచీలు

9 Nov, 2021 09:53 IST|Sakshi

ముంబై: ఆటోమొబైల్‌, టెక్నాలజీ, ఫైనాన్సియల్‌ షేర్ల అండతో దేశీ సూచీలు సానుకూలంగా ముందుకు కదులుతున్నాయి. ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాలతోనే ఆరంభమయ్యాయి. సెన్సెక్స్‌కి 60వేల పాయింట్ల వద్ద నిఫ్టీకి 18వేల పాయింట్ల దగ్గర గట్టి నిరోధత ఎదురైంది.

ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 101 పాయింట్లు లాభపడి 60,646 పాయింట్ల దగ్గర కొనసాగుతుండగా నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 18,104 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఈ రోజు ఎంఅండ్‌ఎం, ఇండస్‌బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ , సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు లాభపడగా పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నెస్టల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియస్‌ పేయింట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు