మార్కెట్‌పై బేర్‌ పంజా.. మంగళవారం తప్పని నష్టాలు

23 Nov, 2021 09:36 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌లో బేర్‌ పట్టు కొనసాగుతోంది. గత ఏడు నెలలుగా మార్కెట్‌లో కొనసాగిన బుల్‌ ర్యాలీ ఆగిపోయింది. ఇంత కాలం వేచి చూసిన ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు రిలయన్స్‌, ఆరామ్‌కో డీల్‌ రద్ధవడం, పేటీఎం షేర్‌ ఓవర్‌ వాల్యూ తదితర అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
 
ఈరోజు ఉదయం నష్టాలతో 57,983 పాయింట్లతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా పాయింట్లు కోల్పోతూ వచ్చింది. ఉదయం 9:30 గంటల సమయంలో 663 పాయిం‍ట్లు నష్టపోయి 57,801 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 134 పాయింట్లు నష్టపోయి 17,281 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోగా టాటా స్టీల్‌ , ఏషియన్‌ పేయింట్స్‌, మారుతి సూజుకి, నెస్టల్‌ ఇండియా షేర్లు లాభాలు పొందాయి.

చదవండి: ఏడు నెలల్లో అతిపెద్ద నష్టం

మరిన్ని వార్తలు