మెటావర్స్‎లో భూమిని కొన్న దలేర్ మెహందీ.. దేశంలోనే రికార్డు!

25 Mar, 2022 21:35 IST|Sakshi

మీరు అవతార్ సినిమా చూశారా? అందులో హీరో అతని టీం ఒక ప్రత్యేకమైన ఎక్విప్​మెంట్​ వేసుకుని తమ అవతార్ వెర్షన్​ని పండోరా గ్రహానికి తగ్గట్లు మార్చేసుకుంటారు. అంటే వాళ్లు రియాలిటీలో వేరేగా ఉన్నా, మరో చోట, మరో రూపంలో పండోర వాసులతో కలిసి బతుకుతుంటారు. ఫైటింగ్​లు చేస్తారు. ప్రేమలూ నడుస్తాయి. ఆ పాత్ర జీవితం అంతా ఒట్టిదే అని తెలుసు. అయినా సరే ఎంజాయ్ చేస్తాం. మెటావర్స్ కూడా అంతే ఇదొక డిజిటల్ ప్రపంచం. ఇందులో మనకు నచ్చినట్లు బతక వచ్చు. కానీ, ఇది ఒక డిజిటల్ ప్రపంచం. మెటావర్స్ అనేది నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీ. ఓ రకంగా చెప్పాలంటే ఫ్యూచరిస్టిక్ త్రీడి ఇంటర్నెట్ అని చెప్పొచ్చు. 

ఫిజికల్ రియాలిటీ, ఆగ్‌‌‌‌మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కలిసిందే మెటావర్స్. అయితే, అలాంటి  మెటావర్స్‎లో ప్రముఖ ఇండియన్ సింగర్ దలేర్ మెహందీ భూమిని కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. దీంతో, దలేర్ మెహందీ ఒక రికార్డు సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా మెటావర్స్‎లో భూమిని కొన్న వ్యక్తిగా మెహందీ నిలిచారు. మెటావర్స్‎లో ప్రదర్శన ఇచ్చిన మొదటి భారతీయ సెలబ్రిటీగా చరిత్ర సృష్టించాడు. అతను ట్రావిస్ స్కాట్, జస్టిన్ బీబర్, మార్ష్మల్లో, అరియానా గ్రాండే వంటి అంతర్జాతీయ కళాకారుల లిస్టులో చేరాడు. వీరు మెటావర్స్‎లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు, డాలర్ మెటా-యూనివర్స్‎లో తన కోసం భూమిని కొనుగోలుచేసినట్లు తెలిపాడు. మెటావర్స్‎లో కొనుగోలు చేసిన భూమికి "బల్లె బల్లె" అని పేరు పెట్టారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సహాయంతో ప్లేయబుల్ ఎన్‌ఎఫ్‌టిలతో కూడిన ఈ వేదికను హైదరాబాద్ నగరానికి చెందిన గేమ్ స్టూడియో గమిత్రోనిక్స్ రూపొందించింది. 

(చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి మహీంద్రా తీపికబురు.. ఈ ఏడాదిలోనే!)

మరిన్ని వార్తలు