HyperFighter Colossus: రేసింగ్‌ స్పోర్ట్స్ బైక్స్‌లో సంచలనం..! అందులోనూ ఎలక్ట్రిక్‌ బైక్‌..! ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 235 కి.మీ..!

8 Jan, 2022 17:13 IST|Sakshi

Hyperfighter Colossus Electric Sports Bike: ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేసే పనిలో ఆయా ఆటోమొబైల్‌ కంపెనీలు నిమగ్నమైనాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లలోకి తెచ్చాయి. కాగా వీలైనంతా ఎక్కువ మేర రేంజ్‌ను అందించే వాహనాలపై ఆయా సంస్థలు దృష్టిసారించాయి. దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలకు పోటీగా ఆయా స్టార్టప్స్‌ కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ముందంజలో ఉన్నాయి. పలు స్టార్టప్స్‌ మరో అడుగు ముందుకేసి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్లను కూడా రూపొందిస్తున్నాయి. 

రేసింగ్‌ బైక్స్‌లో సంచలనం..!
దిగ్గజ రేసింగ్‌ స్పోర్ట్‌ బైక్స్‌ సంస్థలకు సవాలు విసురుతూ ఫాస్టెస్ట్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ను కెనడాకు చెందిన స్టార్టప్‌ సంస్థ డామన్‌ మోటార్స్‌ ఆవిష్కరించింది. అమెరికా లాస్‌వేగాస్‌లో జరుగుతున్న సీఈఎస్‌-2022 షోలో  హైపర్‌ఫైటర్ కొలోసస్(HyperFighter Colossus) ఎలక్ట్రిక్‌ బైక్‌ను ప్రదర్శించింది. రేసింగ్‌ స్పోర్ట్స్‌ బైక్స్‌కు గట్టి పోటీగా నిలుస్తోందని కంపెనీ అభిప్రాయపడింది. 


 

స్పీడ్‌లో..రేసింగ్‌ బైక్స్‌కు పోటీగా..!
డామన్‌ మోటార్స్‌ రూపొందించిన హైపర్‌ఫైటర్ కొలోసస్ గరిష్ట వేగం 273 kmph. అంటే సంప్రాదాయ రేసింగ్‌ బైక్లకు సమానంగా ఈ బైక్‌ దూసుకెళ్తోంది. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకుంటుంది.  ఈ బైక్‌లో  20 kWh బ్యాటరీను అమర్చారు. ఈ బైక్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 235 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తోందని కంపెనీ వెల్లడించింది.  


 

ఫీచర్లలో కమాల్‌..!
హైపర్‌ఫైటర్ కొలోసస్ ఎలక్ట్రిక్‌ బైక్‌ రైడింగ్‌ అనుభూతిని అందించేందుకు సరికొత్త డిజైన్‌తో డామన్‌ మోటార్స్‌ రూపొందించింది. ప్రమాదాలను నివారించేందుకుగాను 360-డిగ్రీల అధునాతన హెచ్చరిక వ్యవస్థను అమర్చారు. అందుకోసం అనేక రాడార్లు, సెన్సార్లను, కెమెరాలను ఏర్పాటుచేశారు. ఈ బైక్‌ ధర 35 వేల డాలర్లు(దాదాపు రూ. 25 లక్షలు)గా ఉండనుంది. 

చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు