Dao EVTech: వంద కోట్ల పెట్టుబడికి శ్రీకారం.. తమిళనాడుకి మహర్దశ

4 Mar, 2023 13:41 IST|Sakshi

భారతీయ ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే మన దేశంలో కొన్ని కంపెనీలు విరివిగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ Dao EVTech భారీ పెట్టుబడిని ప్రకటించింది.

మహారాష్ట్ర పూణే సమీపంలోని చకన్‌లోని 'డావ్‌ ఈవీటెక్‌' (Dao EVTech) తమిళనాడులో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 షోరూమ్‌లను కలిగి ఉన్న ఈ కంపెనీ మరిన్ని షోరూమ్‌లను ప్రారభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

(ఇదీ చదవండి: పది గ్రాముల బంగారం రూ. 2 లక్షలకుపైనే .. ఎక్కడంటే?)

తమిళనాడులో ఇప్పటికే మధురై, పొల్లాచ్చి, కోయంబత్తూర్, తంజావూరు ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లను కలిగి ఉన్న డావ్‌ ఈవీటెక్‌ మరిన్ని డీలర్ నెట్‌వర్క్స్ ప్రారంభించనుంది. చెన్నైలో ప్రారభించాలనుకున్న డీలర్‌షిప్‌లు త్వరలోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన నగరాల్లో డీలర్‌షిప్‌లు ప్రారంభమవుతాయి.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి తమళనాడు చాలా కీలకమైన ప్రాంతం. చెన్నైలో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఎక్కువ జనాభా ఉండటం వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహన విక్రయాలకు చాలా దోహదపడతాయని కంపెనీ చైర్మన్ డాక్టర్ మైఖేల్ లుయి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కంపెనీని మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

>
మరిన్ని వార్తలు