స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

23 May, 2022 18:24 IST|Sakshi

పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో సోమవారం ఉదయం ప్రారంభం నుంచి  స్టాక్‌ మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ..సాయంత్రం స్వల్ప నష్టాలతో  ముగిశాయి. దీంతో బీఎస్‌ఈ 38 పాయింట్ల నష్టంతో 54,289వద్ద ముగియగా..నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 16,215 వద్ద క్లోజయ్యింది. 

బీఎస్‌ఈలో టాటా స్టీల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,ఎస్‌బీఐ,భారతీ ఎయిర్‌ టెల్‌ షేర్లు నష్టపోయాయి. ఎల్‌ఐసీ షేర్ 1.14శాతం నష్టపోయి రూ.816.85తో సరిపెట్టుకుంది. 

ఎంఅండ్‌ ఎం, మారుతి, హిందుస్తాన్‌ యూనిలివర్‌, ఏసియన్‌ పెయింట్స్‌,ఎల్‌ అండ్‌ టీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్టీపీ షేర్లు లాభాలతో ముగిశాయి.  

స్టాక్‌ మార్కెట్‌పై స్టీల్‌ దెబ్బ 
ఇక ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్‌ కోల్‌, ఫెర్రోనికెల్‌,పీసీఐ కోల్‌,కేక్‌,సెమీ కేక్‌ వంటి ముడి పదార్ధాలపై కేంద్రం కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేసింది. దీంతో పాటు దేశీయ పరిశ్రమలకు ఇనుప ఖనిజం అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎగుమతి సుంకాన్ని 30 నుంచి 50శాతానికి పెంచారు. ఐరన్‌ పెల్లెట్ల ఎగుమతిపై 45శాతం, స్టీల్‌ ఇంటర్‌ మీడియరీస్‌పై 15శాతం పెంచారు. దీంతో ఆ ప్రభావం దేశీయ స్టాక్స్‌పై పడింది. ముఖ్యంగా స్టీల్‌ స్టాక్‌ విభాగంలో నిఫ్టీ షేర్‌లలో  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 13.21శాతంతో రూ.83.35 నష్ట పోయింది. వీటితో పాటు టాటా స్టీల్‌, దివిల్యాబ్స్‌,ఓఎన్‌జీసీ,హిందాల్కో షేర్లు నష్టాలతో ముగిశాయి. 

మరిన్ని వార్తలు